Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింటర్‌లో వెయిట్ లాస్.. కివీ పండ్లు తింటే చాలు..

Advertiesment
వింటర్‌లో వెయిట్ లాస్.. కివీ పండ్లు తింటే చాలు..
, బుధవారం, 9 జనవరి 2019 (17:29 IST)
శీతాకాలంలో ఆహారం అంత సులభంగా జీర్ణం కాదు. అలాంటి సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. ఇంకా వింటర్‌లో తీసుకునే ఆహారంలో బరువు పెరిగిపోయే ప్రమాదం వుంది. అందుచేత లైట్ ఫుడ్‌ను తీసుకుంటూ.. బరువును నియంత్రించుకోవచ్చునని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.
 
అంతేగాకుండా వింటర్ ఫుడ్‌లో బరువు తగ్గాలంటే.. బొజ్జను కరిగించుకోవాలంటే.. ఈ ఐదు రకాల పండ్లను తీసుకోవాలి. ఈ ఐదు రకాల పండ్లను తీసుకుంటే జిమ్‌కెళ్లి వర్కౌట్ చేయకుండానే బరువు సులభంగా తగ్గొచ్చు. ఆ పండ్లు ఏమిటో ఓసారి చూద్దాం.. 
 
బరువు తగ్గాలంటే... ముఖ్యంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా పొట్ట తగ్గుతుంది. ఇంకా సీజనల్ ఫుడ్స్ తీసుకుంటే.. బరువును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా వింటర్‌లో దొరికే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరడంతో పాటు బొజ్జ తగ్గుతుంది. ద్రాక్షలు, నారింజ పండును తీసుకుంటే బొజ్జను తగ్గించుకోవచ్చు. 
 
రక్తపోటును నియంత్రించుకోవచ్చు. వీటిల్లోని లో-కెలోరీలు బరువు తగ్గిస్తాయి. ఇంకా ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్లు ఒబిసిటీని దరిచేరనివ్వవు. అలాగే దానిమ్మ గింజలను రోజుకు రెండు కప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూర్చినవారవుతారు. 
 
ఈ పండు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. ముఖ్యం పొట్టను పెరగనివ్వదు. దానిమ్మ గింజలను తీసుకోవడం ద్వారా జిమ్‌కు వెళ్లకుండా.. వర్కౌట్స్ చేయకుండానే బరువు తగ్గవచ్చునని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 
 
ఇక కివీస్ పండ్లు.. ఇవి వింటర్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్. వీటిల్లో విటమిన్లు పుష్కలంగా వుంటాయి. విటమిన్ సి, ఈ, ఫోలేట్, డైయటరీ ఫైబర్ వుంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించి.. బరువును తగ్గిస్తాయి. అలాగే అరటి పండ్లు కూడా బరువును తగ్గిస్తాయంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. 
 
చాలామంది అరటిపండ్లు తింటే బరువు పెరిగిపోతామనుకుంటారు. అయితే ఇందులో హై-కెలోరీలు, చక్కెర శాతం అధికంగా ఆహారం తీసుకోనివ్వదు. ఇందులోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీయాక్సిడెంట్లు శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. ఇంకా అరటి పండ్లు శరీరంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తాయి. బరువును కూడా నిరోధిస్తాయి. 
webdunia
 
వీటితో పాటు నిమ్మను శీతాకాలంలో మరిచిపోకూడదు. నిమ్మలో బరువును తగ్గించే న్యూట్రీషియన్లున్నాయి. విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్లు బరువును నియంత్రిస్తాయి. గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి రోజూ పరగడుపున తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరటిపువ్వు కూరను పెరుగుతో కలిపి...?