Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చలికాలం... పెదాలు పగిలితే ఇలా చేయాలి...

Advertiesment
Winter Lips
, సోమవారం, 7 జనవరి 2019 (21:43 IST)
చలికాలంలో  పెదవులు పగిలి, పొడిబారినట్లుగా ఉండి ఇబ్బందిపెడుతుంటాయి. ఆ సమస్య నుండి తప్పించుకోవటానికి మాయిశ్చరైజర్లు, లిప్ స్టిక్స్ లాంటివి వాడుతుంటారు. వీటిని వాడటం వలన చర్మం పాడవుతుంది. అలాకాకుండా ప్రకృతిపరంగా లభించే సహజసిద్ధమైన కొన్ని ఆహారపదార్ధాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం, అధిక వేడీ,సరైన శ్రద్ద తీసుకోకపోవడం వల్ల పెదాలు సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారుతాయి. ఆ సమస్యను తగ్గించాలంటే కొన్ని రకాల పదార్దాలను ఆహారంలో చేర్చుకోవడమే దీనికి చక్కటి పరిష్కారం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. పెదాలు ఆరోగ్యంగా ఉండటానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.
 
2. బ్లాక్ టీ బ్యాగ్‌ను గోరు నీటిలో ముంచి రెండు మూడు నిమిషాల పాటు దానిని పెదాలపై నెమ్మదిగా అద్దండి. ఇది పెదాలలో తేమను పెంచుతుంది.
 
3. టీ, కాఫీలు తాగడం వల్ల కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ఇందులోని ఫాలీఫినాల్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. అంతేకాదు వయసు పెరగడం, ఎండ వేడి వల్ల కమిలిపోయిన పెదాలకు రక్షణ కల్పిస్తాయి. టీ బ్యాగుల్నీ పెదాలపై మృదువుగా మర్దనా చేయడం వల్ల ఎండిపోయి పగిలిన పెదాలకు సాంత్వన లభిస్తుంది.
 
4. టొమాటోలో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. వీటిలో సెలినీయం అనే యాంటీఆక్సీడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని, పెదవులను కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూసుకోవాలి. ఎండలో నుంచి రాగానే మీ పెదాలకు టొమాటో గుజ్జు లేదా రసం పూయడం వల్ల  అవి తమ సహజ రంగును కోల్పోవు సరికదా తాజాగానూ ఉంటాయి.
 
5. ప్రతిరోజు చెంచా తేనె తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  ఒక్కొక్కసారి పెదవులు పగిలి ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటప్పుడు గ్లిజరిన్ రెండు చుక్కలు, నిమ్మరసం అరస్పూను తీసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెదవులకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి.     
 
6. ఈ కాలంలో దాహం వేయడం లేదు కదా అని నీళ్లు తాగకుండా ఉంటాం. కానీ ఇది సరికాదు. సగటున శరీరానికి అవసరమయ్యే నీటితోపాటు శీతాకాలంలో ఇంకా ఎక్కువ నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంతోపాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు స్నాక్స్ అని గోల చేస్తున్నారా? బాదం పూరీలు పెట్టి చూడండి...