బాణసంచా నిషేధం సరికాదు... రాందేవ్ : ఆన్‌లైన్‌లోనూ అమ్మకంపై నిషేధం

దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచాపై నిషేధం విధించడంపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా తీర్పు ఉందన్నారు. అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు హిందువులను ల

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (06:57 IST)
దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచాపై నిషేధం విధించడంపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా తీర్పు ఉందన్నారు. అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందన్నారు. ఇలా హిందువుల పండగలపై నిషేధం విధించడం సరికాదన్నారు. 
 
బాణసంచా నిషేధాన్ని సమర్థించిన కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌పైనా ఆయన మండిపడ్డారు. థరూర్‌ వంటి విజ్ఞానవంతులు ఇలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ప్రాంతంలో దీపావళి రోజున ఏర్పడే వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యేడాది బాణసంచా అమ్మకాలు, వినియోగంపై నవంబర్ ఒకటో తేదీ వరకు నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు... ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఢిల్లీ పోలీసులు తాజాగా ఆన్‌లైన్‌లోనూ బాణసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆన్‌లైన్‌లో బాణసంచా అమ్మకాలు జరిపితే.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్‌ ప్రతినిధి మధూర్‌ వర్మ హెచ్చరించారు. బాణసంచా అమ్మకాలపై తాత్కాలికంగా ఇచ్చిన లైసెన్సులను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments