డేరా బాబా పీఏ రాకేష్, న్యాయసలహాదారుకు వృషణాలు లేవు.. సీబీఐ షాక్
డేరా బాబా ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తన ఆశ్రమానికి వచ్చే స్త్రీలను శృంగారానికి వాడుకున్న డేరా బాబా, పురుషులను నపుంసకులుగా మా
డేరా బాబా ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తన ఆశ్రమానికి వచ్చే స్త్రీలను శృంగారానికి వాడుకున్న డేరా బాబా, పురుషులను నపుంసకులుగా మార్చేసిన సంగతి తెలిసిందే. నపుంసకుడిగా మారిన డేరాబాబా అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు సీబీఐ అధికారులు జైలులోనే విచారణ ప్రారంభించారు.
డేరాలోని డాక్టర్లే బాబా అనుచరులకు ఈ శస్త్రచికిత్సలు చేశారని గుర్తించారు. దీనిపై గతంలో దర్యాప్తు చేయాలని సీబీఐని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో డేరాబాబా పీఏ రాకేష్, న్యాయసలహాదారు దాస్‌లకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ వృషణాలు లేవని తేలింది. దీంతో దీనిని మరింత సీరియస్‌గా తీసుకున్న సీబీఐ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. రోహ్తక్ జైలులో ఉన్న గుర్మీత్ సింగ్‌ను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు కలిసి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.