Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోమిరెడ్డికి చుక్కలు చూపించిన వర్మ.. హీరోయిన్లు గౌరవానికి అనర్హులా? తెలిస్తే ఉరేసుకుంటావ్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుం

సోమిరెడ్డికి చుక్కలు చూపించిన వర్మ.. హీరోయిన్లు గౌరవానికి అనర్హులా? తెలిస్తే ఉరేసుకుంటావ్
, గురువారం, 12 అక్టోబరు 2017 (11:21 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతీ ఎంట్రీ నుంచి ఎన్టీఆర్ మృతి చెందడం వరకు గల కథతో వర్మ సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రంపై తెలుగుదేశం పార్టీ నేతల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. 
 
ఇందులో భాగంగా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై తీవ్ర వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ ఫేస్‌బుక్ ఖాతాలో స్పందించారు. "మై రిప్లైస్ టు ది గ్రేట్ ఆనరబుల్ టీడీపీ అగ్రికల్చర్ మినిస్టర్ 'మర్యాద తిమ్మన్న' సోమిరెడ్డి గారి కామెంట్స్‌కు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విడిచారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, వాటికి తన సమాధానాలు చెప్పాడు. త్యాగశీలి లక్ష్మీపార్వతి.. సినిమాలో హీరోయిన్‌గా ఆమెనే పెట్టుకోమనండి అంటూ సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఎన్టీఆర్ జీవిత చరిత్రలో సినిమాలో హీరోగా చేయమని వర్మ అడగడం సంతోషమని.. నేను హీరోగా చేయాలంటే.. హీరోయిన్‌గా లక్ష్మీపార్వతిని మార్చాలని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇందుకు వర్మ స్పందిస్తూ.. "సార్ మీరు హీరోయిన్‌గా లక్ష్మి పార్వతి గారిని వద్దని చెప్పినప్పటి నుంచి దీపికా పదుకునే నుంచి మీ వ్యవసాయ భూముల్లో పనిచేసే స్త్రీ కూలీలదాకా అందరినీ అడిగి చూశా.. వాళ్ల రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా" అన్నాడు.
 
అంతేగాకుండా.. లక్ష్మీ పార్వతీ గారంటే తనకు చాలా గౌరవం వుందని.. అందుకే ఆమె హీరోయిన్‌గా వద్దంటున్నానన సోమిరెడ్డి సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలకు వర్మ కౌంటరిచ్చారు. "అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ... హీరోయిన్లపై మీ ఈ ఇన్సల్టింగ్ కామెంట్ పైన దీపికా పదుకొనె, సమంత, కత్రినా కైఫ్, ఇలియానా, ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లను మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్లూ కూడా మీ అంత.. అంటూ అర్థం చెప్పలేదు. ఎందుకులే, ఎంత చెడ్డా మీరు మినిస్టర్ గా!" అన్నాడు.
 
"ఎన్టీఆర్ గురించి నాకు తెలిసినంతగా రామ్ గోపాల్ వర్మకు తెలియదు" అన్న సోమిరెడ్డి వ్యాఖ్యలపై "మై డియర్ సోమి, ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని" అని సెటైర్ వేశాడు. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ సినిమాను ఎన్నికల ముందు తీస్తున్నట్లు సోమిరెడ్డి ఆరోపించారు. ఇందుకు వర్మ కౌంటరిచ్చారు. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేకుండానే రాజకీయ నాయకుడివి ఎలా అయ్యావయ్యా అంటూ.. నీ ''ఎన్'' అంటే నీ నోరుకో నమస్కారం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను పిజ్జా కొనివ్వమంది.. పెళ్లైన రెండో రోజే చెక్కేసింది..