Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేతిలో చిల్లిగవ్వ లేదు... జరిమానా ఎలా కట్టాలి : డేరా బాబా

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అలాగే, రూ.30 లక్షల అపరాధం కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. ఈ సొమ్ము చెల్లించేందుకు ఆయన

చేతిలో చిల్లిగవ్వ లేదు... జరిమానా ఎలా కట్టాలి : డేరా బాబా
, సోమవారం, 9 అక్టోబరు 2017 (16:09 IST)
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అలాగే, రూ.30 లక్షల అపరాధం కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. ఈ సొమ్ము చెల్లించేందుకు ఆయన వద్ద చిల్లిగవ్వ లేదట. ఈ జరిమానా చెల్లించలేనని ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టుకు తెలిపారు. 
 
డబ్బు కట్టకపోవడానికి కారణమేంటంటూ ధర్మాసనం ప్రశ్నించగా... డేరాబాబా తరపు వాదిస్తున్న లాయర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. డేరా సంస్థకు చెందిన ఆస్తులన్నింటినీ అటాచ్ చేశారని ఈ నేపథ్యంలో ఆయన రూ.30 లక్షలను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. అయితే, ఈ వాదనను హైకోర్టు కొట్టిపారేసింది. 
 
పంచకుల కోర్టు ఆదేశించిన విధంగా రెండు నెలల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ జరిమానా మొత్తాన్ని అత్యాచార బాధితులకు చెల్లించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప్ చేశాడు.. ఇల్లును రాయించుకున్నాడు : తెలంగాణ మహిళ ఫిర్యాదు