Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే : సుప్రీంకోర్టు ధర్మాసనం

మైనర్ భార్యతో శృంగారం చేయడం అత్యాచారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 15 నుంచి 18 ఏళ్లు నిండని మైనర్, భార్య అయినా, ఆమెతో శృంగారం కఠిన శిక్షార్హమేనని, నేరానికి పాల్పడిన వ్యక్తికి సెక్షన్

Advertiesment
Supreme Court
, బుధవారం, 11 అక్టోబరు 2017 (14:34 IST)
మైనర్ భార్యతో శృంగారం చేయడం అత్యాచారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 15 నుంచి 18 ఏళ్లు నిండని మైనర్, భార్య అయినా, ఆమెతో శృంగారం కఠిన శిక్షార్హమేనని, నేరానికి పాల్పడిన వ్యక్తికి సెక్షన్ 375 ప్రకారం మినహాయింపులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరుగుతున్న బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయంలో కేంద్రం తక్షణం స్పందించాలని కోరింది.
 
కాగా, జీవిత భాగస్వామి వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత, బలవంతంగా శృంగారానికి పాల్పడటాన్ని వైవాహిక అత్యాచారంగా ప్రకటించే అంశంలో మాత్రం అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దేశంలో 2.3 కోట్ల బాల్య వివాహాలు ఉండగా, వాటిని రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
నిజానికి గతంలో బంధుమిత్రుల నడుమ వైభవంగా వివాహం జరిగిన తర్వాత, భార్య మైనర్ అయినప్పటికీ, వారి మధ్య శృంగారాన్ని పెద్ద నేరంగా పరిగణించలేమని, భారత వివాహ విలువ, దాంపత్య బంధాలున్న అడ్డుగోడలు శిక్షకు అడ్డంకులని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 
 
ఇదే పిటీషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్, 18 ఏళ్లు నిండని భార్యపై జరిపే శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించి శిక్షించే అంశంపై చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టాం: ఉత్తరకొరియా హ్యాకర్లు