Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ రాజకీయ తెరంగేట్రం.. మూడు ఛానల్స్‌ రెడీ అవుతున్నాయా?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (14:35 IST)
తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ త్వరలో ప్రకటించనున్నారని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో తన పార్టీ కోసం ప్రచారానికి సొంత టీవీ ఛానల్స్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు సూపర్ స్టార్. 
 
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు టీవీ ఛానల్స్ ప్రారంభించేందుకు రజనీకాంత్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు.. ప్రజల్లోకి వెళ్లేందుకు సొంత టీవీ ఛానల్ అవసరమని రజనీకాంత్ భావిస్తున్నారు. 
 
తాజాగా రజనీకాంత్ టీవీ, సూపర్ స్టార్, తలైవా టీవీ పేరుతో మూడు ఛానల్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతుందని.. వీటికి సంబంధించిన లోగోలు కూడా రిజస్టర్ అయినట్లు టాక్. 68 ఏళ్ల రజనీకాంత్ సినిమాలను పక్కనబెట్టి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో దిగనున్నారని సమాచారం. 
 
గత ఏడాది రాజకీయాల్లోకి రానున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇటీవల రజనీకాంత్ ఇంకా ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా మారలేదని చెప్పారు. కాగా ఇప్పటికే తమిళనాడులో డీఎంకేకు కలైంజ్ఞర్ టీవీ, అన్నాడీఎంకేకు జయ టీవీ వంటి ఛానల్స్ ఉన్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అల్లు అర్జున్ 'పుష్ప-3' ఖాయం... ప్రధాన విలన్ ఆయనేనా?

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments