రూ.710.98 కోట్లు వసూలు చేసిన చిట్టి

శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "2పాయింట్ఓ". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం గత నెల 29వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
అక్షయ్ కుమార్ పక్షిరాజుగా నటించిన ఈ చిత్రం పూర్తి సైంటిఫిక్ ఫిక్షన్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.700 కోట్ల మేరకు వసూలు చేసినట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్నటివరకు రూ.710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ.166 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ తెలిపారు. ఇప్పటికీ అమెరికాలో '2.O' వందకు పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు.
 
ఈ చిత్రం మొదటి వారంలో రూ.526.86 కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో తొలి రోజున రూ.27.31 కోట్లు, 2వ రోజున రూ.32.57 కోట్లు, 3వ రోజున రూ.36.465 కోట్లు, 4వ రోజున రూ.39.20 కోట్లు, 5వ రోజున రూ.17.13 కోట్లు, 6వ రోజున రూ.14.66 కోట్లు, 7వ రోజున రూ.16.80 కోట్లు కలిపి మొత్తం రూ.710.98 కోట్లు వసూలు చేసినట్టు ఆయన వెల్లడించారు. 

 

#2Point0 WW Box Office:

FIRST ever Kollywood film to CROSS ₹700 cr gross mark.

Week 1 - ₹ 526.86 cr
Week 2
Day 1 - ₹ 27.31 cr
Day 2 - ₹ 32.57 cr
Day 3 - ₹ 36.45 cr
Day 4 - ₹ 39.20 cr
Day 5 - ₹ 17.13 cr
Day 6 - ₹ 14.66 cr
Day 7 - ₹ 16.80 cr
Total - ₹ 710.98 cr

— Manobala Vijayabalan (@ManobalaV) December 13, 2018

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చెక్కు బౌన్స్ అయిందట...