Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో విషాదం : పడవ మునిగి 13 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:22 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో గురువారం జరిగిన విషాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 13కు చేరింది. చంబల్ నదిలో పడవ మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. మృతులను జ్యోతి (13), గ్లోమా (15)గా గుర్తించారు. ఘటనా స్థలానికి కిలోమీటరున్నర దూరంలో వీరి మృతదేహాలను గుర్తించినట్లు సహాయ బృందాలు తెలిపాయి.
 
ఖటోలీ ప్రాంతం నుంచి 35 మంది భక్తులు, 18 బైకులతో బుంది జిల్లాలోని కాళేశ్వర్‌ స్వామి ఆలయానికి వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి 22 మంది సురక్షితంగా బయటపడగా 13 మంది గల్లంతయ్యారు. వీరిలో 11 మంది మృతదేహాలను ఇప్పటికే వెలికితీయగా శుక్రవారం మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. 
 
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి ప్రమాదానికి కారణమైన మహేంద్ర మీన, హేమ్‌రాజ్‌, మోదులాల్‌, వినోద్‌తోపాటు మరొకరిపై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్‌ పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments