Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ్‌పూర్‌లో వితంతువును బెదిరించి గ్యాంగ్ రేప్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (13:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాయ్‌పూర్‌కు చెందిన వితంతువు ఓ హోటల్‌లో కిచెన్‌లో పాచిపని చేస్తూ వస్తోంది. అదే హోటల్‌లో పని చేస్తున్న సురేశ్ సాహు(24) అనే యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడి, అది మరింత సన్నిహితంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమెకు మాయమాటలు చెప్పి నిర్జనప్రదేశానికి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె ప్రతిఘటించి, కేకలు వేసింది. ఈ కేకలు ఆలకించి ముగ్గురు వ్యక్తులు అక్కడకు చేరుకుని సాహును బెదిరించి తరిమిగొట్టారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి ఆ వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం