Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫణి తుఫాను విధ్వంసం ఇదీ... నామరూపాల్లేని భువనేశ్వర్ రైల్వే స్టేషన్

Webdunia
ఆదివారం, 5 మే 2019 (15:01 IST)
ఫణి తుఫాను ఒడిషా రాష్ట్రంలోని పూరి వద్ద తీరందాటింది. ఈ తుఫాను తీరందాటినప్పటికీ.. అది సృష్టించిన విధ్వంసం మాత్రం అలానే మిగిలివుంది. ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని రైల్వే స్టేషన్ పూర్తిగా నామరూపాల్లేకుండా పోయింది. అలాగే, ఈ తుఫాను దాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆదివారానికి 16కు చేరింది. 
 
తుఫాను బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పూరీ వద్ద తీరాన్ని తాకిన ఫణి... ఉదయం పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించింది. గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఒడిశాలో 2 వేల మంది అత్యవసర సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్ సిబ్బంది, లక్ష మంది అధికారులు, స్వచ్ఛంధ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 
 
వేసవిలో సంభవించిన అత్యంత అరుదైన తుఫాన్ ఫణి అని, గత 43 యేడ్లలో ఇలాంటి తుఫాన్ రావడం ఇదే తొలిసారి అని, 150 ఏండ్లలో మూడోది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. తుఫాన్ ప్రభావంపై ప్రధాని మోడీ శనివారం సీఎంతో మాట్లాడారని, ఆదివారం లేదా సోమవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. 
 
తుఫాను సృష్టించిన విలయాన్ని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నామరూపాల్లేకుండా పోయాయి. ఫ్లాట్‌ఫాంలపై ఉండే రేకుల షెడ్డులన్నీ కొట్టుకునిపోయాయి. ఫలితంగా ఈ స్టేషన్ నుంచి బయలుదేరే అన్ని రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. ఈ స్టేషన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదినక సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments