Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ఖర్మకాలే రోజు వస్తుంది : రాహుల్ వ్యాఖ్యలు

Webdunia
ఆదివారం, 5 మే 2019 (14:51 IST)
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంచలన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. నరేంద్ర మోడీ… యుద్ధం ముగిసిందని, ఖర్మఫలం మీకోసం ఎదురుచూస్తుందని దుయ్యబట్టారు. రాజీవ్ గాంధీని విమర్శించడం వల్ల తాను రాజకీయంగా లబ్ది పొందానన్న భ్రమలో మోడీ ఉన్నారన్నారు. 
 
మోడీ… మీ మీద ఇప్పటికి ప్రేమ ఉందని ఒక కౌగిలింత ఇస్తున్నానని రాహుల్ ట్వీట్ చేశారు. దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఇలాంటి విమర్శలు చేయడం మోడీ దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చురకలంటించారు. 
 
రాజీవ్‌పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని గతంలో ఢిల్లీ కోర్టు చెప్పిందని గుర్తుచేశారు. బోపార్స్ స్కామ్‌లో రాజీవ్ లంచం తీసుకున్నట్టుగా ఎక్కడ ఆధారాలు లేవని చిదంబరం స్పష్టం చేశారు. మోడీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ, బీజేపీకి ప్రజలే బుద్ది చెబుతారని ప్రియాంక గాంధీ తాజా వ్యాఖ్యలపై సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments