Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్కిస్ బానో కేసు : దోషులందరికీ స్వేచ్ఛ - రాహుల్ ఫైర్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (21:49 IST)
బిల్కిస్ బానో అనే మహిళ అత్యాచారం కేసులో దోషులుగా ఉంటూ జైలుశిక్షలు అనుభవిస్తున్న వారిని గుజరాత్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
నేరస్థులకు బీజేపీ మ‌ద్ద‌తు ప‌లుకడం మ‌హిళ‌ల ప‌ట్ల ఆ పార్టీ వైఖ‌రిని తేట‌తెల్లం చేస్తోంద‌ంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ త‌ర‌హా రాజ‌కీయాల ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సిగ్గుప‌డ‌టం లేదా అని రాహుల్ నిల‌దీశారు. 
 
ఉన్నావ్‌, హ‌త్రాస్, క‌థువా లైంగిక దాడి ఘ‌ట‌న‌లు, తాజాగా బిల్కిస్ బానో కేసులో దోషుల విడుద‌లను ప్ర‌స్తావిస్తూ మహిళ‌ల ప‌ట్ల బీజేపీ వైఖ‌రిని రాహుల్ ఎండ‌గ‌ట్టారు. ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్ర‌య‌త్నించార‌ని, క‌థువాలో రేపిస్టుల‌కు అనుకూలంగా ర్యాలీ చేప‌ట్టార‌ని రాహుల్ గుర్తుచేశారు.
 
ఇక హ‌త్రాస్‌లో రేపిస్టుల‌కు అనుకూలంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని తాజాగా గుజ‌రాత్‌లో రేపిస్టుల‌ను విడుద‌ల చేసి గౌర‌వించార‌ని మండిప‌డ్డారు. నేరస్థుల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ బీజేపీ మ‌హిళల ప‌ట్ల త‌న చౌక‌బారు వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించింద‌ని దుయ్య‌బ‌ట్టారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం