Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాపీ మేస్త్రిగా మారిన రాహుల్ గాంధీ.. ఎక్కడ? (Video)

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (14:21 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాపీ మేస్త్రీగా మారిపోయారు. ఆయన భవన నిర్మాణ కార్మికులతో కలిసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్‌లో నీళ్లుపోసి ఇసుక, సిమెంట్‌ను మిశ్రమంగా చేశారు. ఆ మిశ్రమంతో తాపీతో మెట్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారంటూ ట్వీట్ కింద పేర్కొంది. 
 
ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ (జీటీబీ) నగర్‌లో కొందరు భవన నిర్మాణ కార్మికులను రాహుల్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి నిర్మాణ పనుల్లో నిమగ్నమై, ఆ తర్వాత కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కారులో తిరిగి వెళుతూ ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాలను షేర్ చేశారు. 
 
దేశంలో కూలిపనులు చేసే వారికి గౌరవ లభించడం లేదు. గతంలోనూ ఈ విషయం చెప్పా. ఇవాళ జీటీబీ నగర్‌లో కూలీలను కలిసి మాట్లాడాక ఈ విషయం మరోమారు రుజువైంది. కూలీలు నిత్యం పనికోసం జీటీబీ నగర్‌లో ఎదురు చూస్తుంటారు. ఒక్కోసారి ఆ కాస్త డబ్బు కూడా దొరుతుందన్న గ్యారెంటీ లేదు. కార్మికులు, కూలీలకు పూర్తిగా హక్కులు, గౌరవం తీసుకురావడమే నా జీవిత లక్ష్యం అని రాహుల్ తన సందేశంలో పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments