Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరో తరగతి చదువుతున్న బాలికతో యువకుడి పెళ్లి..!!

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (14:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో ఓ మైనర్ బాలికకు తల్లిదండ్రులే వివాహం చేశారు. ఆరో తరగతి చదువుతున్న తమ కుమార్తెకు తల్లిదండ్రులే ఈ పనికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని పాఠాశాల ఉపాధ్యాయులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బీరుప్ప అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఆరో తరగతి చదివే బాలికను వివాహం చేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో జూన్ నెలలో బాలికకు వివాహం చేసినట్టు తెలిపారు. 
 
ఈ క్రమంలో ఇటీవల మళ్లీ పాఠశాలలు ప్రారంభం కావడంతో బాలిక స్కూల్‌కు వెళ్లింది. అయితే, ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన ఉపాధ్యాయులు అనుమానం వచ్చి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చిన అధికారులు బాలిక వద్ద ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ బాలికను స్టేట్ హోంకు తరలించారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు బీరప్పతో పాటు తల్లిదండ్రులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments