ఔను.. నేను మధురమైన తీవ్రవాదిని : అరవింద్ కేజ్రీవాల్

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (08:38 IST)
తాను ఉగ్రవాదిని కాదని పంజాబ్ ఓటర్లు తీర్పునిచ్చారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే, పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తాను స్వీటెస్ట్ తీవ్రవాదినని తేల్చారని గుర్తుచేశారు. 
 
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఆ రాష్ట్రాన్ని ఊడ్చేసింది. దీంతో ఢిల్లీ ఆవల ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఫలితాలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పంజాబ్ ఓటర్ల తీర్పుుతో తాను ఉగ్రవాదిని కాదని తీర్పునిచ్చారన్నారు. రాజకీయ పార్టీలన్ని ఆప్‌కు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయని, అందరూ తమనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. 
 
తమ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద కుట్రలు కూడా జరిగాయన్నారు. అందుకే తనపై ఉగ్రవాది అనే ముద్ర వేసి ఎన్నికల్లో ప్రచారం చేశారని ఆరోపించారు. అయితే, ప్రజలు మాత్రం కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని తీర్పునిచ్చారన్నారు. పైగా, పంజాబ్ మట్టి మనిషి, నిజమైన జాతీయవాది అంటూ తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
దీనిపై ఆయన ట్వీట్ చేశారు. తాను స్వీటెస్ట్ టెర్రరిస్టును. ప్రజల కోసం ఆస్పత్రులు, స్కూళ్లు నిర్మిస్తున్న మధురమైన ఉగ్రవాదిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనా కేజ్రీవాల్ విమర్శలు చేశారు. తాను ప్రొ సెపరేటిస్టును అయితే మోడీ ఎందుకు నిరూపించలేకపోయారని, దర్యూప్తు ఎందుకు జరిపించలేదని ఆయన ప్రశ్నించారు. కాగా, కేజ్రీవాల్‌ను విపక్ష నేతలంతూ వేర్పాటువాదిగా ముద్రవేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments