Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేస్తే లండన్‌కు వెళ్లిపోతాం.. ప్రియాంక దేవదూత : నళిని

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (09:33 IST)
తన భర్త మురుగన్‌ను విడిచిపెడితే లండన్‌కు వెళ్లిపోతామని రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన నళిని ప్రాధేయపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హంతకులందరినీ తమిళనాడు ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
అయితే, నళిని భర్త మురుగన్‌ను తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరానికి తరలించారు. దీనిపై నళిని మాట్లాడుతూ, తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరంలో మురుగన్‌ను ఉంచారని దాన్ని ప్రత్యేక జైలుగా మార్చనున్నట్టు తెలిపారని ఆవేదన వ్యక్తం చేసింది. లండన్‌లో తమ కుమార్తె హరిత తమ కోసం ఎదురు చూస్తుందని చెప్పింది. తన భర్తను ప్రభుత్వం విడుదల చేస్తే లండన్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు వెళ్లిపోతామని తెలిపింది. 
 
జైలు జీవితం తమకు ఎన్నో అనుభవాలను నేర్పిందన్నారు. బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోవడం పట్ల చాలా బాధపడుతున్నామని, తమకు క్షమాభిక్ష ప్రసాదించిన సోనియా కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మనసు అంగీకరించడం లేదని చెప్పింది. 
 
2008లో ప్రియాంకా గాంధీ తమను జైలులో కలిసినపుడు తండ్రి హత్య గురించి ప్రశ్నించారని, అపుడు భావోద్వేగానికి గురై బోరున ఏడ్చానని తెలిపింది. ప్రియాంకా గాంధీ ఒక దేవదూత అని చెప్పుకొచ్చింది. అయితే, తాము అమాయకులమనే విషయం కాలమే నిర్ణయిస్తుందని నళిని తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments