Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోబ్రా నా కెరీర్ లో బిగ్ ఛాలెంజింగ్ మూవీ :చియాన్ విక్రమ్

Advertiesment
Chiyan Srinidhi, Meenakshi, Mrinalini Ravi, nvprasad
, సోమవారం, 29 ఆగస్టు 2022 (07:45 IST)
Chiyan Srinidhi, Meenakshi, Mrinalini Ravi, nvprasad
చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. తాజాగా 'కోబ్రా'' చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. విక్రమ్, శ్రీనిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకులతో నాకు గొప్ప అనుబంధం వుంది. నేను నటనకు ఆస్కారం వుండే పాత్రలు, సినిమాలు చేసినప్పుడల్లా గొప్పగా ఆదరిస్తారు. కోబ్రాలో కూడా అద్భుతమైన ఫెర్ ఫార్మెన్స్ వుంటుంది. కోబ్రా కథ నాకు చాలా నచ్చింది. కథ విన్న వెంటనే సినిమా చేసేయాలనిపించింది. సినిమా మొదలుపెట్టిన తర్వాత కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అయితే అవన్నీ దాటుకుంటూ సినిమాని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. రష్యాలో మైనస్ డిగ్రీలలో చిత్రీకరీంచినపుడు సహాయ దర్శకులు రక్తం కూడా వచ్చింది. చాలా కష్టపడి చేశాం. ఒకొక్క పాత్రకి మేకప్ వేయడానికి సుమారు ఐదు గంటల సమయం పట్టేది. అయితే దిన్ని ఎంజాయ్ చేశాను. ప్రతి పాత్రకి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఆలోచిస్తున్నపుడు చాలా ఆనందంగా వుండేది. 
 
కోబ్రా సైకాలాజికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా, హై ఆక్టేవ్ యాక్షన్. టెక్నికల్ గా వున్నంతంగా వున్న సినిమా ఇది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్  శ్రీనిధి,. మీనాక్షి , మృణాళిని. చక్కగా తెలుగులో మాట్లాడారు. కొబ్రాలో శ్రీనిధి, నాకు మంచి రొమాంటిక్ బాండింగ్ వుంటుంది. దర్శకుడు అజయ్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. మీనాక్షి కాలేజీ అమ్మాయిగా కనిపిస్తుంది. మృణాళిని పాత్ర ఎమోషనల్ గా వుంటుంది. కోబ్రా బయటికి ఒక హాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నా లోపల ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఇలా చాలా ఎలిమెంట్స్ వున్నాయి. రోషన్ అండ్రూ విలన్ గా కనిపిస్తారు. ఇర్ఫాన్ పఠాన్ మొదటి సినిమా ఇది. ఆయనసెట్స్ కి వచ్చినపుడు నటన గురించి పెద్దగా తెలీదు. కానీ దర్శకుడు అజయ్ ట్రైన్ చేసి ఒక ప్రొఫెషనల్ నటుడిగా తీర్చిదిద్దారు.ప్రేక్షకులకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.  సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. కోబ్రా ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. ఇంత మంచి సినిమాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన వుంటే ఒక ధైర్యం. కోబ్రా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కోబ్రాని తెలుగు ప్రేక్షకులతో పాటు థియేటర్లో కలసి చూస్తా'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ దర్శకుడు బాబీకి పితృ వియోగం