Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షా హాలులో పురిటినొప్పులు - ఆస్పత్రిలో ప్రసవం

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (11:45 IST)
ప్రభుత్వ ఉద్యోగ వేటలో భాగంగా కొన్ని నెలల పాటు కష్టపడిన చదివిన ఓ మహిళకు ఉద్యోగ పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పరీక్ష రాయలేకపోయినప్పటికీ పండంటి కుమార్తెకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని ఆ మహిళ వెల్లడించింది. 
 
ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో గత నెల 28వ తేదీన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయలు ఎంపికకు సంబంధించి ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించింది. గత నెల 27, 28వ  తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. 
 
టోంక్ జిల్లా మాల్ పురాలో గత నెల 28వ తేదీన పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ప్రియాంక చౌధరి అనే గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో టోంక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు సాధారణ ప్రసంవం చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పరీక్ష మరోమారు రాసుకోవచ్చని, కానీ తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని ప్రియాంక భర్త జీత్ రామ్ చౌధరి హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments