Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది.. గర్భిణికి తప్పిన ప్రాణాపాయం... (Video)

Advertiesment
ambulance blast

ఠాగూర్

, శుక్రవారం, 15 నవంబరు 2024 (09:32 IST)
ఆపదలో ఉన్న రోగులను ఆస్పత్రికి చరేవేసే అంబులెన్స్ ప్రమాదంలో చిక్కుకుంది. అత్యవసరం కోసం అంబులెన్స్‌లో అమర్చిన ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. దీంతో అంబులెన్స్ వాహనం తునాతునకలైపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగింది. అయితే, ఈ ప్రమాదం నుంచి గర్భిణి మహిళతో పాటు ఆమె సహాయకులు ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డారు. అంబులెన్స్ ఇంజిన్ నుంచి పొగలు వచ్చినవెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. గర్భిణిని, ఆమె సహాయకులను కిందికి దించేయడంతో వారు ప్రాణాల నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
జల్గావ్ జిల్లాలోని దాదా వాడి ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. గర్భిణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అంబులెన్స్‌లో ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో అంబులెన్స్ ఇంజిన్‌లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. అంబులెన్స్‌ను రోడ్డు పక్కకు ఆపి కిందకు దిగాడు. 
 
గర్భినిణి, ఆమె కుటుంబ సభ్యులను కూడా దిగిపొమ్మని చెప్పాడు. వారంతా దిగి దూరంగా వెళ్లిన కాసేపటికే అంబులెన్స్‌లో మంటలు రేగాయి. అందులోని ఆక్సిజన్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లల్లో కిటికీల అద్వాలు సైతం పలిగిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా కుట్రకు కేటీఆర్ ఆదేశం... పట్నం వాంగ్మూలం?