జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోను మంతనాలు...

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (09:12 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోనులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
'అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు జో బైడెన్‌తో నేను ఫోనులో మాట్లాడాను. అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని మేము నిర్ణయించాం. పలు ప్రాధాన్యతాంశాలు, సవాళ్లు మా మధ్య చర్చకు వచ్చాయి. కొవిడ్-19 మహమ్మారి, వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ రీజియన్‌లో సహాయ సహకారాలు సహా పలు అంశాల గురించి మాట్లాడుకున్నాం' అని మోడీ తన ట్వీట్‌లో వివరించారు. 
 
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించగా, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన విషయం తెల్సిందే. అయినప్పటికీ ట్రంప్ అధ్యక్ష పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అమెరికాలో అధికార మార్పిడికి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments