భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (14:23 IST)
పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ వైమానికస్థావరం భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించడమే. ఆయన మంగళవారం ఈ వైమానిక స్థావరానికి వెళ్లి గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ఆయన వైమానిక దళ అధికారులు, సైనికులతో ముచ్చటించారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై సాయుధ బలగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ అక్కడే ఓ గంట పాటు ఉన్నారు 
 
గత ఏప్రిల్ నెల 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది భారత పర్యాటకులను హతమార్చిన విషయం తెల్సిందే. దీనికి ప్రతిగా మే 7వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. ఆ తర్వాత మే 9, 10వ తేదీల్లో పాకిస్థాన్‌ దాడికి యత్నించిన వైమానిక స్థావరాల్లో ఆదంపూర్ ఒకటి కావడం గమనార్హం. ఈ పర్యటన ద్వారా సైనికుల ధైర్యసాహసాలను, నిబద్ధతను ప్రధాని కొనియాడారు. భారత్ మాతాకీ జై అంటూ సైనికులతో కలిసి నినాదాలు చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసివున్న ఫోటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం