Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి ప్రజలకు రూ.1360 కోట్ల దీపావళి కానుకలు.. 20న ప్రధాని మోడీ పర్యటన

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:46 IST)
తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20వ తేదీన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వారణాసి ప్రజలకు రూ.1360 కోట్ల విలువ చేసే కానుకలు అందజేయనున్నారు. అంటే వివిధ రకాలైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే, రూ.460 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించి, రూ.900 కోట్లతో ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 
 
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గంలో తొలిసారి పర్యటించనున్నారు. పీఎం మోడీ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం చేపట్టింది. ప్రధాని పర్యటన సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పాటు వారణాసిలోనే మకాం వేసి, ఈ పర్యటన ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు నగరం మొత్తాన్ని అలంకరించాలని సూచించారు. 
 
కాగా ప్రధాని మోడీ వారణాసి పర్యటన ఐదు గంటల పాటు కొనసాగనుంది. అక్టోబరు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వారణాసికి చేరుకుని, అక్కడ నుంచి హర్హువా సంధా రింగ్ రోడ్డులోని శంకర్ నేత్రాలయకు చేరుకుంటారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం తర్వాత సింగ్రా స్టేడియంలోని క్రీడా ప్రాంగణంలో వివిద క్రీడాకారులను ఉద్దేశింసి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం