Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:24 IST)
గత 2023లో జరిగిన భయానక దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న హమాస్ చీఫ్ యాహ్వా సిన్వార్‌ను ముట్టుబెట్టినట్టు ఇజ్రాయేల్ అధికారికంగా ధృవీకరించింది. గాజాపై తమ దేశ సైన్యం జరిపిన దాడుల్లో సిన్వార్ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. ఇజ్రాయేల్ దేశానికి చెందిన 1,200 మంది పౌరులు చంపి, 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్న 2023 అక్టోబరులో జరిగిన భయానక దాడులకు ప్రధాన సూత్రధారి యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్టు ఇజ్రాయేల్ గురువారం సాయంత్రం ధ్రువీకరించింది.
 
'ఒక యేడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత, మా దళాలు హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, అనేక మంది ఇజ్రాయేల్ పౌరుల ఊచకోత, కిడ్నాప్‌కు కారణమైన ప్రధాన వ్యక్తి అయిన యాహ్యా సిన్వార్‌ను అంతమొందించాయి. గురువారం గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడుల్లో అతనిని అంతమొందించిన దళాన్ని నేను ఇప్పుడు కలుసుకున్నాను' అని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ కల్నల్ హెర్జి హలేవి గురువారం వెల్లడించారు. 
 
అంతకుముందు గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని ఐడీఎఫ్ వెల్లడించింది. వారిలో యాహ్యా సిన్వార్ ఉండే అవకాశం ఉందని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొన్ని గంటలకే సిన్వార్ మృతిని ఐడీఎఫ్ ధ్రువీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments