Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని అయితే బానిసత్వమే : మల్లికార్జున ఖర్గే

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (11:43 IST)
మరోమారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడితే దేశంలో బానిసత్వం తప్పదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారని ఆయన గుర్తుచేశారు. 
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఓడించకపోతే దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆయన బానిసలుగా మార్చుతారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను బెదిరించి తన దారికి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ అన్ని వర్గాల వారికి న్యాయం దక్కాలన్న లక్ష్యంతోనే రాహుల్‌ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడూ ఇలాంటి యాత్ర చేయలేదని అన్నారు. 
 
మోడీని ఒక నియంతగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రజల దగ్గరకు వెళ్లి మోడీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలపై అవగాహన కలిగించాలని కార్యకర్తలను కోరారు. బూత్‌ కమిటీల నిర్వహణపై కార్యకర్తలకు ఖర్గే సూచనలు ఇచ్చారు. నిజాయితీపరులు, సమర్థులనే ఏజెంట్లుగా నియమించాలన్నారు. లేకుంటే అధికారుల సాయంతో వారు ఓట్లు వేసుకుంటారని, అందువల్ల దీనిపై దృష్టి పెట్టాలని చెప్పారు.  
 
మహిళలను కించపరచడం పశుప్రవర్తనతో సమానం .. : రాహుల్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతలపై ఏపీలోని అధికార వైకాపాకు చెందిన సోషల్ మీడియా గ్యాంగ్ అసభ్యంగా పోస్టులు పెట్టడం ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ షర్మిల పుట్టలేదంటూ వైకాపా సోషల్ మీడియా మూకలు కామెంట్స్ చేసున్నాయి. అయినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఏమాత్రం చలనం లేకుండా చిరు నవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో షర్మిల, సునీతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలించారు. వీరిద్దరిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వీరిద్దరికీ పార్టీ మొత్తం అండగా ఉంటుందని ప్రకటించింది. 
 
మహిళలను కించపరచడం అమానుషమని, ఇది పశు ప్రవర్తనేనని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మహిళలను బెదిరించడం, అవమానించడం నీచమని, ఇది పిరికిపందల చర్య అని ఆక్షేపించారు. ఇలాంటి చర్యలు కాంగ్రెస్‌ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేవని పేర్కొన్నారు. షర్మిలకు మద్దతుగా నిలుస్తామని రాహుల్‌ స్పష్టం చేశారు. షర్మిలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని శక్తులు వణికిపోతున్నాయని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ రోజురోజుకూ బలం పుంజుకుంటోందని చెప్పారు. షర్మిల ప్రతిష్ఠను, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
 
కాగా, 'ఓటమిని ఎదుర్కోలేని పిరికివాళ్లే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారు' అంటూ కామెంట్స్ చేసిన ఆయన.. ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా షర్మిలపై సోషల్‌ మీడియాలో వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు అనుచిత పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె నేరుగా స్పందించకుండా ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా నిప్పులు చెరిగారు. 'ఓటమిని ఎదుర్కొనలేనివారు క్రూరత్వాన్ని ఆశ్రయించడంతో పాటు దుర్మార్గంగా కూడా ఉంటారు' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments