Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద అనేకమంది..?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:25 IST)
Jammu kashmir
జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలింది. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఘటనాస్థలికి చేరుకున్న ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. టన్నెల్ కూలిపోవడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఏర్పడింది.
 
సొరంగం కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు జమ్మూ కాశ్మీర్ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పోలీసులు,సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
 
సొరంగం లోపల చిక్కుకున్న పదిమంది సొరంగం ఆడిట్ చేసే పనిని నిర్వహించే సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు.
 
ఈ ఘటనలో సొరంగం ముందు భాగంలో నిలిపి ఉంచిన బుల్డోజర్లు, ట్రక్కులతో సహా అనేక యంత్రాలు, వాహనాలు దెబ్బతిన్నాయి.
 
రాంబన్ డిప్యూటీ కమిషనర్ మసరతుల్ ఇస్లామ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహిత శర్మ సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments