దేశ రాజధాని ఢిల్లీలోని అసెంబ్లీలో ఓ సొరంగ మార్గం బయటపడింది. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ టన్నెల్ ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా భారత స్వాతంత్ర్య సమరయోధులను తరలించినట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు.
ఈ సందర్భంగా రామ్ నివాస్ గోయల్ మాట్లాడుతూ 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు తాను దీని గురించి వినేవాడినన్నారు. ఎర్రకోటకు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్నట్టు చెప్పేవారని తెలిపారు. దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానని కానీ అంత క్లారిటీ రాలేదన్నారు.
అయితే ఇప్పుడు ఆ టన్నెల్‌కు చెందిన ముఖ ప్రదేశాన్ని గుర్తించామని తెలిపారు. కానీ ఆ టన్నెల్‌ను ఇప్పుడు తొవ్వడం లేదని, ఎందుకుంటే ఆ మార్గంలో మెట్రో పిల్లర్లు, సీవేజ్ నిర్మాణాలు ఉంటాయని చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో టన్నెల్ ప్రాంతాన్ని తాను సందర్శించినట్టు తెలిపారు.