Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్.. 329మంది మృతి.. రోజుకు 20మంది..

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (17:35 IST)
కరోనా సెకండ్ వేవ్ వైద్యులను బలితీసుకుంటోంది. రెండో దశలో ఇది ఏకంగా 329 మంది వైద్యుల ప్రాణాలను హరించినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. వీరిలో దాదాపు 80 మంది ఒక్క బీహార్‌కు చెందినవారేనని పేర్కొంది. ఢిల్లీలో 73 మంది మరణించారని తెలిపింది. కరోనా బారినపడి ఉత్తరప్రదేశ్‌లో 41 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐఎంఏ వివరించింది.
 
ప్రమాదకరమైన ఈ మహమ్మారి బారినపడి రోజుకు సగటున 20 మంది వైద్యులు కన్నుమూస్తున్నారని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మృతి చెందిన వారిలో ప్రభుత్వ, ప్రైవేటు, మెడికల్ ఆసుపత్రులలోని వైద్యులు ఉన్నట్టు ఐఎంఏ వివరించింది. 
 
గత రెండు నెలల్లో 270 మంది వైద్యులు రెండో వేవ్ కారణంగా మరణించారని మంగళవారం ఐఎంఏ తెలిపింది. ఇప్పుడీ సంఖ్య 300 దాటింది. ఇక తొలి వేవ్‌లో గతేడాది 748 మంది వైద్యులు కరోనాతో మరణించారని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments