Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిన వ్యక్తి మృతి.. ఆంబులెన్స్‌కు నిప్పు పెట్టిన బంధువులు

Webdunia
గురువారం, 23 జులై 2020 (12:57 IST)
Fire
కరోనా సోకిన వ్యక్తి.. త్వరలో ఆ రోగం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని అనుకున్నాడు. కానీ ఇంతలో ప్రాణాలు కోల్పోయాడు. కరోనా సోకిన ఓ వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలోని బీమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
 
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని బీమ్స్ ఆస్పత్రికి అతని బంధువులు తరలించారు. అక్కడ కరోనా బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబులెన్స్‌కు నిప్పు పెట్టారు. అది పూర్తిగా కాలిపోయింది.
 
అంతటితో ఆగకుండా ఆస్పత్రిపై రాళ్ల దాడి చేశారు. రోగి చనిపోయినప్పుడు ఐసీయూలో ఉన్న డాక్టర్‌పై దాడి చేసేందుకు కూడా వారు యత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కర్ణాటకలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 4,764 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 55 మంది మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments