Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కంబంధ హస్తాల్లో విశాఖ - ఆస్పత్రులు కిటకిట

Advertiesment
కరోనా కంబంధ హస్తాల్లో విశాఖ  - ఆస్పత్రులు కిటకిట
, గురువారం, 23 జులై 2020 (08:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుందర పట్టణంగా ఉన్న సముద్రతీర ప్రాంతం విశాఖపట్టణం. ప్రస్తుతం ఈ పట్టణం కరోనా కబంధ బస్తాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా, సామాజిక భౌతిక దూరం పాటించని వారంతా ఈ వైరస్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫలితంగా విశాఖ నగరంలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో విశాఖ జిల్లాలోని అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. 
 
విశాక పట్టణంలోకి కరోనా వైరస్ గత మార్చి నెలలో అడుగుపెట్టింది. అయినప్పటికీ... మే చివరి వరకు పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. మార్చిలో 10, ఏప్రిల్‌లో 13, మే నెలలో 90 మంది వైరస్‌బారిన పడ్డారు. ఆ తర్వాత లాక్డౌన్‌ నిబంధనలు సడలిస్తూ వస్తుండటంతో కరోనా కోరలు చాచడం మొదలుపెట్టింది. జూన్‌లో ఒక్కసారిగా 785 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక జూలై మొదటి తేదీ నుంచి మరింత విజృంభించింది. తొలి వారం 623, రెండో వారం 852, మూడో వారం 1057 కేసులతో మొత్తం 1,532 మంది వైరస్‌బారిన పడ్డారు. జూన్‌ చివరినాటికి 900 వున్న కేసులు, 22 రోజుల్లోనే నాలుగు వేల వరకు పెరిగాయి. ఒకే రోజు 1,049 కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు ధైర్యం చాలక బుధవారం రాత్రి బులెటిన్‌ను విడుదల చేయకుండా మౌనం దాల్చారు. 
 
అంటే, నగరంలో ఒక్క బుధవారమే వార్డుకు సగటున 10 కేసుల చొప్పున రికార్డయ్యాయి. గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో ఎక్కువ వచ్చాయి. ఆరిలోవ, వెంకోజీపాలెం, ఇసుకతోట, సీతమ్మధార, సీతంపేట, గోపాలపట్నం, మధురవాడ, అనకాపల్లి, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ భారీగా  కేసులు నమోదయ్యాయి. కాగా ఒక్క రోజులో వేయికి పైగా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమై పాజిటివ్‌ వచ్చిన వారందరినీ ఆర్టీసీ బస్సుల్లో నగర శివార్లలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరుడు సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్, 711 గజాల ఇళ్ల స్థలం