Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్ క్లాసులు కేజీ నుంచి 5 వరకు రద్దు

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (10:07 IST)
కరోనా వైరస్ కారణంగా వాతావరణం మొత్తం తలకిందులైంది. విద్యార్థుల చదువులు కోవిడ్ కారణంగా ఆగిపోయాయి. కరోనాతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఆన్లైన్ ద్వారానే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. కానీ కేజీ నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధించడాన్ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది.
 
అలాగే ఆన్‌లైన్ క్లాసుల పేరుతో వసూలు చేస్తున్న ఫీజులను కూడా రద్దు చేసింది. ఆన్‌లైన్ పాఠాలు, ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. 
 
అంతేకాదు, లాక్ డౌన్ కాలంలో ఇంట్లో ఉండే పిల్లలను చదువుపై ఎలా నిమగ్నం చేయాలనే అంశంపై మార్గదర్శకాలు రిలీజ్ చేసేందుకు కర్ణాటక సర్కారు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పట్లో పాఠశాలలు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో మార్గదర్శకాలను రిలీజ్ చేయాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments