Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. రెండో పెళ్లి చేసుకుంటా: కాశ్మీర్ మాజీ సీఎం

కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ పాయల్‌ మరో వివాహానికి సిద్ధమవుతున్నారు. తన భార్య పాయల్‌తో వివాహం బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. తన భార్య పాయల్‌తో వివాహ బంధం తిరిగి కోల

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (15:22 IST)
కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ పాయల్‌ మరో వివాహానికి సిద్ధమవుతున్నారు. తన భార్య పాయల్‌తో వివాహం బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. తన భార్య పాయల్‌తో వివాహ బంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతీసిందని అన్నారు. మరో వివాహం చేసుకునేందుకు ఆమెతో విడాకులు ఇప్పించాలని ఒమర్ అబ్ధుల్లా కోర్టును విజ్ఞప్తి చేశారు. 
 
పాయల్‌-ఒమర్ అబ్ధుల్లా దంపతులకు 1994, సెప్టెంబర్ 1వ తేదీన వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. కానీ 2007లోనే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 2009 నుంచి వీరు విడివిడిగా వుంటున్నారు. దీంతో 2016, ఆగస్టు 30న తనకు పాయల్ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. 
 
దీంతో తమ మధ్య బంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిందని మళ్లీ ఒమర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది. ఇంతలో పాయల్ ఒమర్ వాదనపై స్పందన ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments