పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన బీజేడీ ఎమ్మెల్యే.. ఠాణాలో ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (09:09 IST)
ఒడిషా రాష్ట్రంలో బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశారు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని జగత్సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు(బీజేడీ) విజయ్‌శంకర్‌ దాస్‌పై సోనాలిక అనే యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసగించాడని ఆరోపించారు. 
 
ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకరించారని, పెళ్లి చేసుకునేందుకు జగత్సింగ్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మే 17న దరఖాస్తు చేసుకోగా, అధికారులు శుక్రవారం స్లాట్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 
తాను కార్యాలయానికి వెళ్లినా, ఎమ్మెల్యే రాకపోవడంతో రెండుగంటల పాటు నిరీక్షించి, వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆయన మాట తప్పారని, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో మోసగించినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments