Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ల్యాప్‌టాప్‌ జెన్‌బుక్‌ ఎస్‌ 13 ఓఎల్‌ఈడీని విడుదల చేసిన అసుస్‌

Laptop
, బుధవారం, 15 జూన్ 2022 (20:15 IST)
తైవనీస్‌ టెక్నాలజీ సంస్థ అసుస్‌, నేడు తమ అతి సన్నటి, తేలికపాటి ల్యాప్‌టాప్‌ జెన్‌బుక్‌ ఎస్‌ 13 ఓఎల్‌ఈడీని విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ కేవలం 1.1 కేజీ బరువు ఉంటుంది. అంతేకాదు 14.9 మిల్లీమీటర్ల మందం కలిగి ఉంటుంది. జెన్‌బుక్‌ ఎస్‌ 13 ఓఎల్‌ఈడీతో అసుస్‌ అతి సన్నటి, శక్తివంతమైన, సుదీర్ఘమైన బ్యాటరీ జీవితం కలిగిన ల్యాప్‌టాప్‌ అందిస్తుంది. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, డిజిటల్‌ ప్రేమికులు ఎల్లప్పుడూ ప్రయాణాలలో ఉండే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.


అసుస్‌ ఇప్పుడు వివోబుక్‌ ప్రో 14 ఓఎల్‌ఈడీ, వివోబుక్‌ 16ఎక్స్‌ను సైతం విడుదల చేసింది. మిల్లీనియల్‌, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఖచ్చితమైన సహచరిగా ఇది ఉంటుంది. జెన్‌బుక్‌ ఎస్‌ 13 ఓఎల్‌ఈడీ ప్రారంభ ధర 99,990 రూపాయలు; వివోబుక్‌ 14 ప్రో ఓఎల్‌ఈడీ 59,990 రూపాయలు, వివోబుక్‌ 16ఎక్స్‌- 54,990 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి. వీటి విక్రయాలు ఆన్‌లైన్‌ (అసుస్‌ ఇ-షాప్‌/అమెజాన్‌), ఆఫ్‌లైన్‌ (అసుస్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు/ఆర్‌ఓజీ స్టోర్స్‌/క్రోమా/విజయ్‌ సేల్స్‌/రిలయన్స్‌ డిజిటల్‌)వద్ద ప్రారంభమయ్యాయి. జెన్‌బుక్‌ ఎస్‌ 13 ఓఎల్‌ఈడీ మాత్రం కేవలం ఫ్లిప్‌కార్ట్‌ వద్ద లభ్యమవుతుంది.


 
ఆల్ట్రా థిన్‌ ల్యాప్‌టాప్‌లలో అత్యంత వేగవంతమైన పనితీరు కలిగిన తాజా ఆవిష్కరణలలో రైజ్‌ విత్‌ రైజెన్‌ ఏఎండీ 6000/5000 సిరీస్‌ ఉంటుంది. మీలోని సృజనశీలుడు, గేమర్‌ని బయటకు తీసుకురావడంతో పాటుగా మరీ ముఖ్యంగా  మీలోని ప్రొఫెషనల్‌ను బయటకు తీసుకువచ్చే రీతిలో ఇది ఉంటుంది. అసుస్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌గ్రూప్‌ అర్నాల్డ్‌ సూ మాట్లాడుతూ, ‘‘గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో పీసీ పరిశ్రమ అసాధారణ వృద్ధి చూస్తోంది.


వృద్ధి చెందుతున్న ఈ డిమాండ్‌, మారుతున్న ఈ వాతావరణం దృష్టిలో ఉంచుకుని మేము మా అతి సన్నటి ల్యాప్‌టాప్‌ జెన్‌బుక్‌ ఎస్‌ 13 ఓఎల్‌ఈడీ ఆవిష్కరించాము. ఈ ఉపకరణంలో  తాజా ఏఎండీ రైజెన్‌ 6000 యు సిరీస్‌ సీపీయు ఉంది. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యంను తమ అత్యద్భుతమైన డిజైన్‌, ఫీచర్లతో అందిస్తుంది. అదనంగా, మా తాజా యూనిట్లను వివోబుక్‌ 14 ప్రో ఓఎల్‌ ఈడీ, వివోబుక్‌ 16ఎక్స్‌ ఓఎల్‌ఈడీను పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. వీటి ద్వారా వినియోగదారుల డిమాండ్‌ తీర్చగలమని భావిస్తున్నాము’’ అని అన్నారు.

 
‘‘అసుస్‌ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుని వారి తాజా జెన్‌బుక్‌ ఎస్‌, వివోబుక్‌ నోట్‌బుక్స్‌ను ఏఎండీ రైజెన్‌ 5000 మొబైల్‌, తాజా రైజెన్‌ 6000 మొబైల్‌ ప్రాసెసర్లతో విడుదల చేశారు’’ అని వినయ్‌ సిన్హా,మేనేజింగ్‌ డైరెక్టర్‌-సేల్స్‌, ఏఎండీ ఇండియా అన్నారు. ‘‘ఈ ఉత్పత్తులు అసుస్‌ వద్ద లభ్యమవుతున్న ల్యాప్‌టాప్‌లో అతి సౌకర్యవంతమైనవి, అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు. ఇవి మా భాగస్వామ్యంను పునరుద్ఘాటించడంతో పాటుగా ఎలాంటి రాజీలేకుండా పనితీరు, సామర్ధ్యంతో కూడిన ల్యాప్‌టాప్‌లు అందించాలనే మా తపనకూ అద్దం పడతాయి. రైజన్‌ 6000 మొబైల్‌ ప్రాసెసర్స్‌ రాడియాన్‌ గ్రాఫిక్స్‌తో అత్యాధునిక జెన్‌ 3+కోర్‌ ఆర్కిటెక్చర్‌తో కలిగి ఉండటంతో పాటుగా కంటెంట్‌ క్రియేటర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌ లేదా క్యాజువల్‌ గేమర్స్‌ లాంటి ఎంతోమంది వినియోగదారులకు వైవిధ్యమైన పరిష్కారాలను అందిస్తాయి’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Galwan Valley - America: భారత్-చైనా సరిహద్దు వివాదంలో భారత్‌కు అమెరికా పూర్తిగా మద్దతు ఇస్తుందా? ఇస్తే ప్రతిఫలంగా ఏం కోరుకుంటోంది?