తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలుచేశారని ఆరోపించారు. బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొని ఈ సంచలన ఆరోపణలు చేశారు.
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ తమ పోలీసులను వారు సంప్రదించారని బెనర్జీ వెల్లడించారు. అయితే తాను తిరస్కరించడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
కాగా, ఇటీవల దేశ రాజకీయాల్లో పెగాసస్ సాఫ్ట్‌వేర్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇజ్రాయేల్‌కు చెందిన ఈ స్పై సాఫ్ట్‌వేర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అనేక మంది ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది.