Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. గాంధీ కుటుంబేతరుడైనా?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (13:32 IST)
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై గాంధీ కుటుంబీకులే కాకుండా... ఇతరులు కూడా ఈ బాధ్యతలు చేపట్టవచ్చునని ప్రియాంక గాంధీ కామెంట్లు చేశారు. ఇందుకు తాను సుముఖంగానే ఉన్నానని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఓ కొత్త పంథా ఎంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి వక్కాణించారు. 
 
గాంధీ కుటుంబీకుడు కాకపోయినా కాంగ్రెస్ అధ్యక్షుడైతే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ వ్యక్తి 'మీ అవసరం యూపీలో లేదు. అండమాన్ నికోబార్‌లో ఉంది. అక్కడికి వెళ్లండని ఆ కొత్త అధ్యక్షుడు ఆదేశించినా... సంతోషంగా అండమాన్ వెళ్లి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తా' అని ప్రియాంకా గాంధీ ప్రకటించారు. 
 
సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడంతో అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ''గాంధీ కుటుంబేతరుడు అధ్యక్షుడు అయినా ఓకే.. నాకు ఆమోదమే'' అని రాహుల్ అన్న వ్యాఖ్యలను ప్రియాంక పూర్తిగా సమర్థించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు ప్రియాంక గాంధీ తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments