భారతీయ జనతా పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ విమర్శలు సంధించారు. బీజేపీ నేతలు మహిళలపై అత్యాచారాలు చేసి జైలుకెళ్తారనీ, అలాంటి నేతలు దూరంగా పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇదే అంశంపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారత మహిళ బీజేపీని, ఆ పార్టీ నేతలను బహిష్కరించాలని కోరారు. మహిళలంటే ఆ పార్టీ నేతలకు గౌరవం లేదన్న ప్రియాంక.. వారిని దూరంగా పెట్టాలన్నారు.
బీజేపీ నేతలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుల్దీప్‌సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద, గోపాల్ కందా.. వీరందరూ మహిళలను వేధించిన వారేనని ఆరోపించారు. ఇటువంటి వారిని బహిష్కరించాలని మహిళల కోరారు.
ఉన్నావో బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ అరెస్టయ్యాక ఆయనను బీజేపీ సస్పెండ్ చేసిందని, ఆ తర్వాత స్వామి చిన్మయానంద కూడా ఇదే తరహా కేసులో అరెస్టయ్యారని ఆమె గుర్తుచేశారు.
తన విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్యకు గోపాల్ కందా కారణమన్న ఆరోపణలు ఉన్నాయని ప్రియాంక అన్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు.