Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాందేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (12:10 IST)
ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ వైద్యవిధానాలపై  ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాల నేపథ్యంలో కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. దీనిపై పాలక్కాడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది.
 
ఈ కేసులో విచారణకు ఫిబ్రవరి ఒకటో తేదీన హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించగా వారు హజరుకాకపోవడంతో.. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన తిరిగి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనల నేపథ్యంలో ఇప్పటికే పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయిన విషయం తెలిసిందే. 
 
కెనడా - మెక్సికో - చైనాలకు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్!! 
 
తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కెనడా, మెక్సికో, చైనా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తేరుకోలేని షాకిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కొన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు విధిస్తామంటూ ప్రకటనలు చేశారు. వీటిని ఇపుడు ఆయన ఆచరణలో పెడుతున్నారు. అమెరికా పౌరులకు మేలు చేకూర్చే ఎలాంటి కష్టతరమైన నిర్ణయాన్ని అమలు చేయడంలో ఆయన ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అందులోభాగంగానే కెనడా, మెక్సికో దిగుమతులతో పాటు చైనా పై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఆ హెచ్చరికలను నిజం చేశారు. ఆయా సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. 'నేడు కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలుకు సంతకం చేశాను. ఫెంటనిల్‌తో సహా మా దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. మాకు అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు మా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నా' అని తన సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం