Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలువలోకి దూసుకెళ్లిన జీపు... 9 మంది మృత్యువాత (Video)

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (11:06 IST)
హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఎంతో సంతోషంగా పెళ్లి తంతు కార్యక్రమాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కొందరు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారంతా ప్రయాణిస్తున్న జీపు అదుపుతప్పి భాక్రా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలతో పాటు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫజిల్కా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో హాజరైన 14 మంది తిరిగి శుక్రవార రాత్రి పొద్దుపోయాక ఓ జీపులో ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో సర్దారేవాలా గ్రామం వద్ద జీపు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఐదుగురు మహిళలు, 11 యేళ్ల బాలిక ఉన్నారు. 
 
మంచు దుప్పటి కప్పేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దారి కనిపించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికి తీశారు. మృతులంతా బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments