Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

Advertiesment
car run

ఠాగూర్

, బుధవారం, 8 జనవరి 2025 (14:39 IST)
ఓ నలుగురు వ్యక్తులు టేబుల్ వద్ద కూర్చొని టీ సేవిస్తున్నారు. ఇంతలో ఓ కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా మరో ఇద్దరు తప్పించుకున్నారు. డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటున్న ఓ వ్యక్తి కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. హర్యానా రాష్ట్రంలోని కైతాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణంగా ఉంది. రద్దీగా ఉన్న రహదారులపై డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. 
 
కానీ, కొందరు ఇవేమీ పట్టించుకోరు. అలాగే, ట్రాఫిక్ రూల్స్​పై కనీస అవగాహన లేకుండానే చాలా మంది వాహనాలను రోడ్లపైకి తీసుకొస్తూ.. ఇలాంటి ప్రమాదాలకు కారకులవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునే ముందు ట్రాఫిక్ రూల్స్ గురించి విధిగా తెలుసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాల నుండి మిమ్మల్ని, ఇతరులను రక్షించవచ్చని ట్రాఫిక్ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు