Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రైతులకు ఇబ్బంది ఉండదు, అందుకే విజయవాడ వచ్చా: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (20:34 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు సంబంధించి రైతులకు స్పష్టత ఇవ్వడానికి అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాక మంత్రి నిర్మలా సీతీరామన్ అన్నారు. అందులో భాగంగా నిన్న తమిళనాడు, ఇవాళ ఏపీకి వచ్చానని అన్నారు. విజయవాడలోని ది వెన్యూ పంక్షన్ హాలులో వ్యవసాయ బిల్లుపై వ్యవసాయరంగ నిపుణులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు సంబంధించి ఎన్ని సవాళ్లున్నా అన్ని మార్పులు చేసి తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. గతంలో రైతు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రంలో తన పంట ఉత్పత్తులను తీసుకెళ్లి అమ్ముకోవడానికి ఇబ్బంది ఉండేదనీ, ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.
 
వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ యార్డులకు తీసుకెళ్తే 8.5 పర్సంట్ టాక్సులు చెల్లించాల్సి వచ్చేదని ఇప్పుడు అలాంటివి ఉండవని తెలిపారు. దీనిద్వారా రైతుకు తన పంటను వేయడానికి ముందే దానిని కొనుక్కోవడానికి అగ్రిమెంట్ కూడా చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. ఈ నూతన బిల్లు ద్వారా ఎవరికి నష్టం జరగదని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మిర్చికి మంచి డిమాండ్ ఉందని, ప్రస్తుతం మన రాష్ట్రంలోనే క్యాష్ చేసుకోవడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments