Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్ ఎన్నికల సమరం : తెరపైకి కొత్త కూటమి

Advertiesment
బీహార్ ఎన్నికల సమరం : తెరపైకి కొత్త కూటమి
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (11:20 IST)
బీహార్ రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం తెరపైకి కొత్త కూటమి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్‌ఎస్‌పీ) చీఫ్ ఉపేంద్ర కుష్వాహా సారథ్యంలో కొత్త కూటమి ఏర్పడుతుందని ప్రకటించారు. ముఖ్యంగా, ఈ కూటమి ఎన్డీయే, ఆర్జేడీ కూటములకు సమాంతరంగా పని చేస్తుందని తెలిపారు. 
 
పైగా, ఈ కూటమి రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తామని చెప్పారు. తమ ఫ్రంట్‌లో బహుజన్ సమాజ్‌ పార్టీ భాగస్వామిగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లూలుప్రసాద్, రబ్రీదేవిలపై కుష్వాహా నిప్పులు చెరిగారు. వారంతా ఒకే నాణానికి ఇరువైపుల ఉన్న బొమ్మబొరుసు లాంటివారని దుయ్యబట్టారు. 
 
మూడున్నర దశాబ్దాల వారి పాలనలో రాష్ట్రం దారుణంగా తయారైందని కుష్వాహా ధ్వజమెత్తారు. అలాగే, ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీఎస్ (నితీష్), ఆర్జేడీ కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. 
 
ఇకపోతే, బీహార్‌లో ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో నిర్వహించనున్నారు. అక్టోబరు 28న తొలి విడత, నవంబరు 3న రెండో విడత, 7న తుది దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే నెల 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూ సూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. ప్రపంచం మారాలంటే... బాబు ప్రశంస