Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిన్నర్‌కు పిలిచి కోడిగుడ్డు కూర వడ్డించలేదని ఫ్రెండ్‌ను చంపేసిన కిరాతకుడు!

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (09:04 IST)
మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. తన స్నేహితుని ఇంటికి డిన్నర్‌కు వచ్చిన మరో ఫ్రెండ్... తనకు కోడిగుడ్డు కూర వండి వడ్డించలేదని ఆగ్రహించాడు. ఈ ఆగ్రహాన్ని తట్టుకోలేక తనను డిన్నర్‌కు పలిచిన స్నేహిడుతుడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగ్‌పూర్‌లోని మకాపూర్ ప్రాంతానికి చెందిన బన్సారీ (40) శనివారం రాత్రి తన స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్‌ను భోజనానికి ఇంటికి ఆహ్వానించాడు. దీంతో గైక్వాడ్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత బన్సారీ, గైక్వాడ్‌లు కలిసి మద్యం సేవించారు.
 
పిమ్మట భోజనానికి కూర్చొన్నారు. భోజనంలో ఇంట్లో తయారు చేసిన అన్ని రకాల కూరలను వడ్డించారు. అయితే, గైక్వాడ్ మాత్రం కోడిగుడ్డు కూర ఎక్కడ అంటూ బన్సారీని ప్రశ్నించగా, అది వండలేదని బదులిచ్చాడు. 
 
దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చివరకు ముదిరిపాకనపడటంతో కోపం పట్టలేని గైక్వాడ్ ఇనుపరాడ్డుతో బన్సారీ తలపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments