Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియాంకా దుస్తులపై అలా చేయి వేయడానికి ఆ మగ పోలీస్‌కి ఎంత ధైర్యం?

Advertiesment
ప్రియాంకా దుస్తులపై అలా చేయి వేయడానికి ఆ మగ పోలీస్‌కి ఎంత ధైర్యం?
, సోమవారం, 5 అక్టోబరు 2020 (14:14 IST)
హత్రాస్ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీని, ఆమె అన్న రాహుల్ గాంధీని వెనక్కి పంపే యత్నంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా, ఓ పోలీస్.. ప్రియాంకా గాంధీ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమె ధరించిన కుర్తా పట్టుకుని లాగేందుకు యత్నించాడు. దీనిపై బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్రా కిశోర్‌ వాగ్‌ మండిపడ్డారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, మహిళా నాయకురాలి దుస్తులపై అలా చేయి వేయడానికి ఆ మగ పోలీసుకి ఎంత ధైర్యం? అంటూ ఆమె నిలదీశారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై విశ్వాసం కలిగిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై తీవ్రంగా స్పందించాలని ఆమె కోరారు. సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తమ పరిమితులు తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. 
 
కాగా, హత్రాస్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌ ప్రతినిధులను గ్రేటర్‌ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసి, లాఠీఛార్జ్‌ చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు గాయాలుకాకుండా ప్రియాంక గాంధీ అడ్డుగా నిలిచేందుకు ప్రయత్నించారు. అదేసమయంలో ఓ పోలీసు ప్రియాంక కుర్తా పట్టుకుని బలవంతంగా వెనక్కి పంపే ప్రయత్నం చేశాడు.
 
దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ మహిళా నేత కూడా ఈ ఘటనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ పోలీసులు ప్రియాంక గాంధీకి క్షమాపణలు తెలిపి, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం : వైమానిక దళ చీఫ్ భదౌరియా