Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.3 వేలు చెల్లిస్తే చాలు.. యేడాదంతా ఫ్రీగా టోల్ పాస్

ఠాగూర్
మంగళవారం, 27 మే 2025 (16:04 IST)
కేంద్ర ప్రభుత్వ కొత్త టోల్ పాలసీని అందుబాటులోకి తీసుకునిరానుంది. ఇందుకోసం రెండు రకాల్లో చెల్లింపులు చేయవచ్చు. ఒక్కసారి రూ.3 వేలు చెల్లిస్తే యేడాది మొత్తం ఫ్రీగా టోల్ పాస్ చేసే అవకాశం కల్పించింది. అలాగే, వంద కిలోమీటర్లకు రూ.50 ఫిక్స్ అమౌంట్ టోల్ ఫీ చెల్లించే విధానాన్ని కూడా తీసుకునిరానుంది. 
 
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జితో ఇబ్బందులు పడే వాహనదారులకు ఇది నిజంగానే శుభవార్తగా చెప్పుకోవచ్చు. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది.
 
తాజా ప్రతిపాదనలో భాగంగా, వాహనదారులు త్వరలో రూ.3 వేల వార్షిక రుసుము చెల్లించే అవకాశం రావచ్చు. తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌లు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌లపై పరిమితులు లేకుండా ప్రయాణించవచ్చు. కొత్తగా తీసుకురానున్న ఈ పథకంలో రెండు చెల్లింపు విధానాలను తీసుకురాబోతున్నారు. 
 
ఇందులో మొదటిది వార్షిక పాస్. దీనికి ప్రతి సంవత్సరం రూ.3 వేల ఫ్లాట్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు టోల్ రోడ్లపై అపరిమిత ప్రయాణాన్ని అందిస్తుంది. 
 
రెండవది దూరాన్ని బట్టి పాస్ తీసుకునే సౌకర్యం. ఈ పథకం కింద వాహనదారులు వంద కిలోమీటర్లకు రూ.50లు నిర్ణీత నగదు చెల్లిస్తారు. దీనికి అదనపు ధ్రువపత్రాలు కూడా ఏమీ అవసరం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments