Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Advertiesment
weekly horoscope

రామన్

, శనివారం, 24 మే 2025 (19:39 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహబలం మిశ్రమ ఫలితాలిస్తుంది. భేషజాలకు పోవద్దు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదివారం నాడు ఖర్చులు విపరీతం. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. మీ ఊహలు, ఆలోచనలు ఫలిస్తాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు కొత్త బాధ్యతలు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. నూతన పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. దూరప్రయాణం తలపెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజకరం. బుధవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్తవ్యక్తులను దరిచేరనీయవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగపరంగా శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింతగా శ్రమించండి. నిరుత్సాహానికి గురికావద్దు. ఉత్సాహంగా ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సోమ, మంగళవారాల్లో ఖర్చులు విపరీయం. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు ఏదో విధంగా నెరవేరుతాయి. ఆటంకాలు ఎదురైనా మొండిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం అన్నివిధాలా యోగమే. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఎవరి సాయం ఆశించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. కీలక వ్యవహారంలో స్పష్టత లోపించకుండా చూసుకోండి. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. మీ బలహీతలు అదుపులో ఉంచుకోండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభసమయం ఆసన్నమయింది. కొత్త యత్నాలకు శ్రీకారం చుట్టుండి. మీ ఆలోచనా ధోరణి ప్రశంసనీయమవుతుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. అవసరాలు నెరవేరుతాయి. పనుల్లో ఆటంకాలెదురైనా పూర్తి చేయగల్గుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆప్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. శుక్రవారం నాడు అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. న్యాయ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. కీలక ఒప్పందాల్లో సమయస్ఫూర్తిగా మెలగండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం వ్యయం చేస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి, ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ఉపాధ్యాయులకు ప్రమోషన్‌తో కూడిన స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆటంకాలెదురైనా ధైర్యంగా యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కార్యదీక్షతోనే లక్ష్యం సాధిస్తారు, బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఆదాయం అంతంత మాత్రమే. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. గురువారం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. పుణ్యక్షేత్రాలు, సందర్శిస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. బంగారు వెండి ఆభరణాలు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహబలం అనుకూలంగా ఉంది. ఆటంకాలు ఎదురైనా మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. మనోధైర్యంతో లక్ష్యాన్ని సాధిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. రావలిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పొదుపునకు అవకాశం లేదు. చేస్తున్న పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒప్పందాల్లో తొందుపాటు తగదు. సంతకాలు, హామీల విషయంలో ఏకాగ్రత వహించండి. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. మీ శ్రీమతి ప్రోద్బలంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో లాభదాయక ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఊహించని సమస్యలెదురవుతాయి. వృత్తిపరమైన అవరోధాలను అధిగమిస్తారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యం నిర్విఘ్నంగా సాగుతుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అనుకున్న ఖర్చులే ఉంటాయి. కొత్త పనులకు ప్రణాళికాలు వేసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి రాగల్గుతారు. దంపతుల మధ్య సమన్వయ లోపం. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి యోగదాయకమే. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంననీయమవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అశక్తతను సున్నితంగా వ్యక్తం చేయండి. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. శుక్రవారం నాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. పరిస్థితులు మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సామాన్యం, వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఆదివారం నాడు కొందరి రాక చికాకుపరుస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఒత్తిడి తగ్గి కుదుటుపడతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sani Pradosham: శనివారం మహా ప్రదోషం: పెరుగు అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తే?