శనివారం వచ్చే ప్రదోషం రోజున శివాలయాన్ని దర్శించుకుంటే ఐదు సంవత్సరాల పాటు ప్రతిరోజూ శివాలయం వెళ్లిన పుణ్యం దక్కుతుంది. సాధారణ ప్రదోషాల కంటే శనివారం వచ్చే మహా ప్రదోషం మహిమాన్వితమైంది. ఈ రోజున మహాదేవుడిని, శనీశ్వరుడిని వ్రతమాచరించి పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
దేవతలను రక్షించడం కోసం పరమేశ్వరుడు విషాన్ని సేవించిన రోజు శనివారం. ఆ సమయం ప్రదోష సమయం. ఆ రెండూ కలిపి వచ్చే శని ప్రదోషం రోజున పరమేశ్వరునికి అభిషేకాది పూజలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శని ప్రదోషం రోజున శివునికి అభిషేకం అలంకారాలతో పాటు నైవేద్యంగా పెరుగన్నాన్ని సమర్పిస్తే సర్వం శుభం.
ఈ పెరుగు అన్నాన్ని ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదం ఇవ్వడం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. కార్యసిద్ధి, విజయాలు వరిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రదోష సమయంలో శివుడిని, నందీశ్వరుడిని స్తుతించడం ద్వారా శివసాయుజ్యం చేకూరుతుంది.
ఈ రోజున శివాలయంలో జరిగే అభిషేకాలను వీక్షించే వారికి సకల పాపాలు హరించుకుపోతాయి. పుణ్యఫలం చేకూరుతుంది. ఐదు సంవత్సరాల పాటు శివాలయాన్ని దర్శించిన ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
ప్రదోష అభిషేకం, ప్రదోష పూజలకు నమ్మదగిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రతి వస్తువు, శివ పూజకు ఉపయోగించబడే ప్రతి పువ్వులు ప్రతి విశిష్టమైన ఫలాలను ఇస్తాయి. బిల్వం, తామరై, మల్లిపువ్వులతో అర్చన చేయవచ్చు.