Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ ఇవ్వలేదనీ కాల్పులు జరిపిన దుండగులు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:20 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అడిగితే సిగరెట్ ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బాధితుడు తప్పించుకోగా, కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌కు చెందిన అమిర్ ఖాన్ అనే యువకుడు తన మిత్రుడితో కలిసి గురువారం రాత్రి 9:30 సమయంలో ఓ షాపింగ్ మాల్ దగ్గర మాట్లాడుతూ నిలబడ్డాడు. ఇంతలో ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమిర్ ఖాన్‌‌ను సిగరెట్ అడిగారు. అందుకతడు నిరాకరించడంతో.. ఆ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. 
 
మాట్లాడుతుండగానే బైక్ మీద కూర్చున్న మరో వ్యక్తి తన పిస్టల్‌ తీసుకుని అమిర్ ఖాన్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ అదే బైక్‌పై పరారయ్యారు. కాగా అమిర్ ఖాన్ ఛాతీలో ఓ బుల్లెట్ దిగింది. కానీ, అదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments