Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారం.. విదేశీ వేదికలపై ఎండగడతాం

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారం.. విదేశీ వేదికలపై ఎండగడతాం
, మంగళవారం, 23 అక్టోబరు 2018 (16:01 IST)
భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారాన్ని తీవ్రతరం చేయనుంది. 1960 ఇండస్ వాటర్స్ ట్రీటీకి సంబంధించి భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారాన్ని తీవ్రతరం చేయనుంది. జమ్మూకాశ్మీర్‌లోని రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులను పాకిస్థాన్ అధికారులు సందర్శించేందుకు భారత్ అనుమతించకపోవడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
జమ్ముకాశ్మీర్‌లోని పాకల్ దూల్, లోయర్ కల్నాయ్ ప్రాజెక్టుల సందర్శనకు అనుమతిస్తామని ఆగస్టు 29, 30 తేదీలలో జరిగిన సమావేశం సందర్భంగా ఇండియన్ వాటర్ కమిషనర్ హామీ ఇచ్చారని పాకిస్థాన్ ఇండస్ వాటర్ కమిషనర్ సయ్యద్ మెహర్ అలీషా చెప్పారు. కానీ జమ్మూకాశ్మీర్‌లో అక్టోబర్‌లో  జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా ఆ కార్యక్రమం వాయిదా పడిందన్నారు. 
 
కానీ తమ పర్యటన షెడ్యూల్‌ను రివైజ్ చేయడంలో భారత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విషయమై లేఖలు రాసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం నేరుగా ఫోన్ కూడా చేశానని... అయినా సరైన సమాధానం రాలేదని అన్నారు. 
 
చీనాబ్ నది మీద నిర్మించిన ఈ ప్రాజెక్టులను తాము పరిశీలిస్తామనే నమ్మకం పోయిందని చెప్పారు. అలాగని భారత్‌పై ఎదురుదాడికి తాము దిగబోమని.. కానీ 1960 ఒప్పందానికి భారత్ ఏ విధంగా తూట్లు పొడుస్తుందనే విషయాన్ని విదేశీ వేదికలపై ఎండగడతామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలెక్షన్ కింగ్ కొడుకు ఎలక్షన్లలో ఏ పార్టీ తరపున పోటీ? స్కూళ్లకు వెళ్తున్నాడే...